అగ్నిమాపక యంత్రాలతో శానిటైజేషన్‌

ABN , First Publish Date - 2020-03-28T11:03:04+05:30 IST

కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్పత్రులు, రైతుబజార్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో

అగ్నిమాపక యంత్రాలతో శానిటైజేషన్‌

యాదాద్రి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ ప్రబలుతున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆస్పత్రులు, రైతుబజార్లు, ఇతర రద్దీ ప్రదేశాల్లో వైరస్‌ నియంత్రణకు అగ్నిమాపక యంత్రాలతో క్రిమిసంహారక మందులను పిచికారికార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర ఆసుపత్రి, రైతు బజారు ప్రాంతాల్లో శుక్రవారం వైర్‌స నిర్మూలన కోసం సోడియం హైపోక్లోరైడ్‌ను అగ్నిమాపక యంత్రాలతో పిచికారి చేస్తూ మెరుగైన పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు.


అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రద్దీ ప్రదేశాల్లో, పెట్రోల్‌ బంకులతో పాటు ఆస్పత్రులను పూర్తిగా రసాయన ద్రావణాలతో పారిశుధ్య కార్యక్రమం చేపడుతున్నట్టు జిల్లా అగ్నిమాపక అధికారి జయక్రిష్ణ తెలిపారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రం భువనగిరితో పాటు యాదగిరిగుట్ట, పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి లాక్‌డౌన్‌ను పర్యవేక్షించారు.  


కరోనా వైరస్‌ నేపథ్యంలో జిల్లా సహాయక అగ్నిమాపక అధికారి పీఏ షణ్ముఖరావు, నల్లగొండ అగ్నిమాపక అధికారి శ్యాంసుందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని కోవిడ్‌, అత్యవసర వార్డు, కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు జిల్లా జైలు, రైతుబజార్‌, ఇతర ప్రజా సంచార ప్రదేశాల్లో సల్ఫర్‌ హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు.  

Updated Date - 2020-03-28T11:03:04+05:30 IST