ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయాలి : కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-29T05:20:16+05:30 IST
జిల్లాలో ఇసుక రీచ్‌లు ఏ ర్పాటు చేసి నాణ్యమైన ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

సూర్యాపేట కలెక్టరేట్, డిసెంబరు 28: జిల్లాలో ఇసుక రీచ్‌లు ఏ ర్పాటు చేసి నాణ్యమైన ఇసుక సరఫరా చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. తాటిపాముల, వర్థమానుకోట, పెరబోయిన గూడెం, కాసారబాద, దోసపహాడ్, అనాజీపురంలో ప్రారంభించాలన్నారు. కోదాడ, హుజూర్‌నగర్‌లలో ఇసుక డిపోలను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాక్టర్ యజమానులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆయా మండల తహసీల్దార్లకు అదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.