ఇసుక డంప్‌లు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-01T05:49:40+05:30 IST

బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణంలో భా గంగా భూమిని తవ్వుతున్న క్రమంలో లభ్యమైన ఇసుకను ఫిల్టర్‌ చేసి అక్రమంగా డంప్‌లు ఏర్పాటు చేసుకొని ఇసుక కుప్పలను సోమవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక డంప్‌లు స్వాధీనం

 ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం 

భువనగిరి రూరల్‌, నవంబరు 30: బస్వాపురం రిజర్వాయర్‌ నిర్మాణంలో భా గంగా భూమిని తవ్వుతున్న క్రమంలో లభ్యమైన ఇసుకను ఫిల్టర్‌ చేసి అక్రమంగా డంప్‌లు ఏర్పాటు చేసుకొని ఇసుక కుప్పలను సోమవారం రెవెన్యూ, పోలీస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ‘అక్రమంగా ఇసుక డంప్‌లు పట్టించుకోని అధికారులు’ అనే కథనం ఆంధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైంది. ఈ మేరకు అప్రమత్తమైన   భువనగిరి తహసీల్దార్‌ ఎం.జనార్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్‌ఐ కే.రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో వీఆర్వో సురేష్‌, ఏఎ్‌సఐ సాగర్‌రావు సోమవారం గ్రామాన్ని సందర్శించి రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా అక్రమంగా డంప్‌ చేసిన 5 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.   


Updated Date - 2020-12-01T05:49:40+05:30 IST