సార్వత్రిక సమ్మె సక్సెస్
ABN , First Publish Date - 2020-11-27T05:39:19+05:30 IST
కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది.

సూర్యాపేట, కోదాడలో కదలని బస్సులు
మూతపడిన దుకాణాలు
జిల్లా వ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు
సూర్యాపేట, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాలపై కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జిల్లాలో విజయవంతమైంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌లో భారీ ర్యాలీలు తీశారు. తిరుమలగిరి చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సమ్మెలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొనడంతో ఎక్కడ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులు పడ్డారు. అర్వపల్లి, చింతలపాలెం, నూతనకల్, నేరేడుచర్లతో పాటు పలుచోట్ల రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తీరుమార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు.