సమ్మెను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2020-11-25T05:48:05+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐక్య కార్మిక సంఘాల నాయకులు కోరారు.

సమ్మెను విజయవంతం చేయాలి
నల్లగొండలో ర్యాలీ నిర్వహిస్తున్న వివిధ సంఘాల నాయకులు

నల్లగొండ, నవంబరు 24: కేంద్ర ప్రభుత్వం అవలంబి స్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ  26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐక్య కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఆయా సంఘాల ఆధ్వ ర్యంలో జిల్లాకేంద్రంలో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు పెద్దబోయిన రామలింగయ్య,  బొమ్మిడి నాగేష్‌, నాయకులు ఎండీ. మోహి ను ద్దీన్‌, సుంకిశాల వెంకన్న, ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు. గ్రా మీణ బంద్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ కోరారు. గ్రామీణ బంద్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నల్లగొండ మండల కన్వీనర్‌ పొలేపల్లి సత్యనారాయణ కోరారు. దోమలపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు గాదె యాదయ్య నరసింహ, స్వామి, లక్ష్మమ్మ, నాగరాజు పాల్గొన్నారు. సమ్మెకు సీపీఎం మాడ్గు లపల్లి మండల కమిటీ మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్‌ తెలిపారు. సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ నాయకులు నకిరేకల్‌లో బైక్‌ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తు మ్మల వీరారెడ్డి, టీఆర్‌ఎస్‌కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలివేరు ప్రభాకర్‌, వంటె పాక వెంకటేశ్వర్లు, కందాళ ప్రమీళ, సాకుంట్ల నర్సింహ, శిగ శ్రీను, ఉయ్యాల సైదులు, గొర్ల సోమయ్య పాల్గొన్నారు. చండూరులో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడారు. సమా వేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మందడి నర్సింహారెడ్డి, మండల పార్టీ కార్యదర్శి నలపరాజు సతీష్‌, బరిగెల వెంకటేష్‌, సురిగి చలపతి, కైలాసం పా ల్గొన్నారు. చిట్యాలలో జరిగిన సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి అవి శెట్టి శంకరయ్య, సీపీఐ మండల కార్యదర్శి ఎండీ అక్బర్‌ మాట్లాడారు. శాలిగౌరారం జరిగిన కార్య క్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మారోజు చంద్రమౌళి, నాయకులు మల్ల య్యయాదవ్‌ పాల్గొన్నారు. చిట్యాల మండలం వెలిమినేడులో వ్యవసాయ కా ర్మిక సంఘం నాయకులు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. నార్కట్‌పల్లిలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యకాసం నాయకుడు చెర్కు పెద్దులు, వార్డుసభ్యుడు అర్థం శ్రీనివాస్‌, మంద గోపాల్‌, గంట యాదయ్య, సీహెచ్‌. నర్సింహ్మా, షకీల్‌, గోపాల్‌, మల్లేశ్‌ పాల్గొన్నారు. మిర్యాలగూడలో నిర్వహించిన ప్రచారజాతాను సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్రారం భించారు. కార్యక్రమంలో నాయకులు డబ్బికార్‌ మల్లేష్‌, రవినాయక్‌, తిరుపతి రాంమూర్తి, పధాని శ్రీను, సోమయ్య, బొంగరాల వెంకటయయ్య, అంజన్‌రెడ్డి పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మెతోపాటు జరిగే గ్రామీణబంద్‌ను విజయవంతం చేయాలని రైతుసంఘం జిల్లా అ ధ్యక్షుడు వారేపల్లి వెంకటేశ్వర్లు కోరారు. కార్యాలయంలో సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఇంద్రారెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, గోవిందరెడ్డి, రాంరెడ్డి పాల్గొన్నారు. మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించారు.  వేములపల్లి పీహెచ్‌సీలో వైద్యాఽఽధికారికి సీఐటీయూ జిల్లా నాయకుడు రొండి శ్రీనివాస్‌ సమ్మె నోటీసు అందజేశారు. నల్లగొండలో జీపుజాతను బండా శ్రీశైలం ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎండి సలీం, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండంపల్లి సత్తయ్య, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. 


Read more