సామాన్యుడి గౌరవాన్ని పెంచేందుకు స.హ.చట్టం
ABN , First Publish Date - 2020-12-07T04:59:12+05:30 IST
పరిపాలన జవాబుదారీ కావాలనే లక్ష్యంతో తెచ్చిన సమాచార హక్కు చట్టం నేడు సామాన్యుడి గౌరవాన్ని పెంచేందుకు దోహదపడుతుందని సమాచార హక్కుచట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.

భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 6: పరిపాలన జవాబుదారీ కావాలనే లక్ష్యంతో తెచ్చిన సమాచార హక్కు చట్టం నేడు సామాన్యుడి గౌరవాన్ని పెంచేందుకు దోహదపడుతుందని సమాచార హక్కుచట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కుచట్టం ప్రచార సమితి రాష్ట్ర అవగాహన సదస్సు భూదాన్‌పోచంపల్లిలో ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సైతం సమాచార హక్కు చట్టానికి కట్టుబడి పనిచేయాలన్నారు. సదస్సులో జాయింట్ కలెక్టర్ డి శ్రీనివా్‌సరెడ్డి, ఆర్డీవో సూరజ్‌కుమార్, తహసీల్దార్ దశరథనాయక్, హైకోర్టు న్యాయవాదులు ఏవీవీఎస్ భుజంగరావు, రాపోలు వేణు, పోచంపల్లి చేనేత టైఅండ్‌డై అసోసియేషన్ అధ్యక్షుడు తడ్క రమేష్, కె కమలాకర్, కిషన్ నాయక్, లింగంయాదవ్ తదితరులు పాల్గొన్నారు.