నేడు సాగర్, మూసీ నీటి విడుదల
ABN , First Publish Date - 2020-12-15T06:12:05+05:30 IST
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ, మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో యాసంగి పంటల సాగుకోసం ఈ నెల 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నారు.

యాసంగి పంటల సాగు కోసం
వారబందీ విధానం అమలు
6.3లక్షల ఎకరాలకు సాగునీరు
నాగార్జునసాగర్, కేతేపల్లి, డిసెంబర్ 14: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఎడమ కాల్వ, మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల పరిధిలో యాసంగి పంటల సాగుకోసం ఈ నెల 15వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నారు. సాగర్ నుంచి మొత్తం ఏడు విడతల్లో వారబందీ విధానంలో 2021,ఏప్రిల్ 15 వరకు నీటి విడుదల ఉండనుంది. ఎడమకాల్వ పరిధిలో మొదటి జోన్‌లో ఉన్న నల్లగొండ జిల్లాలో 3.8లక్షల ఎకరాలు, రెండో జోన్‌లో ఉన్న సూర్యాపేట,ఖమ్మం జిల్లాల్లోని 2.5లక్షల ఎకరాలు, మొత్తం 6.3 లక్షల ఎకరాలకు నాలుగు నెలల పాటు 84 రోజులు 55 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్ట్ సీఈ నర్సింహ సోమవారం తెలిపారు. అలాగే ఎస్‌ఎల్‌బీసీకి 20టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే వానకాలం పంటలకు నీటి విడుదల కొనసాగుతున్నందున, దీన్ని యాసంగి పంటలకు కొనసాగిస్తామని, సాగునీటిని పొ దుపుగా వాడుకోవాలన్నారు. కాగా, మూసీ నీటి విడుదలను మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. 645అడుగుల (4.46టీఎంసీలు) పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం ఉన్న మూసీలో ప్రస్తుతం 644.70అడుగుల(4.38టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. యాసంగి పంటల సాగుకు నాలుగు విడతలు 70 రోజుల పాటు 3.235టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. ఒక్కో విడత నడుమ 15 రోజుల విరామం ఇవ్వనున్నారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటి నిల్వలు పుష్కలంగా ఉండడంతో పాటు ఎగువ నుంచి నిరాటకంగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో గత ఏడాదిలాగే సాగునీటిని ముందస్తుగా విడుదలచేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే కుడి కాల్వకు వారం రోజులుగా నీటని విడుదల చేస్తున్నారు.
సాగర్ నీటి విడుదల షెడ్యుల్ ఇలా..
విడత నుంచి వరకు రోజులు క్యూసెక్కులు టీఎంసీలు
మొదటి 15.12.20 14.01.21 30 9000 23.33
రెండో 20.01.21 29.01.21 9 7000 5.44
మూడో 04.02.21 13.02.21 9 6700 5.21
నాలుగో 19.02.21 28.02.21 9 7000 5.44
ఐదో 06.03.21 15.03.21 9 6800 5.29
ఆరో 21.03.21 30.03.21 9 6800 5.29
ఏడో 05.04.21 14.04.21 9 6430 5.00
మొత్తం 84 49730 55.00
మూసీ నీటి విడుదల షెడ్యూల్ ఇలా..
విడత నుంచి వరకు రోజులు టీఎంసీలు
మొదటి 15.12.20 09.01.21 25 1.15
రెండో 24.01.21 08.02.21 15 0.684
మూడో 23.02.21 10.03.21 15 0.699
నాలుగో 25.03.21 04.04.21 15 0.702
మొత్తం 70 3.235