26లోగా పల్లెప్రకృతి వనాలను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-08-20T11:22:14+05:30 IST

గ్రామాల్లో ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ఈనెల 26లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌

26లోగా పల్లెప్రకృతి వనాలను పూర్తి చేయాలి

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 19: గ్రామాల్లో ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు ఈనెల 26లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రకృతి వనాల ఏర్పాటు, హరితహారం మొక్కల సంరక్షణపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ ట్రైనీ ప్రతిమాసింగ్‌, డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, జడ్పీ ఇన్‌చార్జి సీఈఓ సీతాకుమారి, జేడీఏ శ్రీధర్‌రెడ్డి ఉన్నారు. 

Read more