గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: ఐజీ

ABN , First Publish Date - 2020-03-04T11:51:41+05:30 IST

గ్రామాభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని వరంగల్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి సూచించారు.

గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలి: ఐజీ

అడవిదేవులపల్లి(దామరచర్ల), మార్చి 3: గ్రామాభివృద్ధే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని వరంగల్‌ జోన్‌ ఐజీ నాగిరెడ్డి సూచించారు. మంగళవారం అడవిదేవులపల్లి మండలకేంద్రంతోపాటు జిలకరకుంటతండాలో మొదటి, రెండోవిడత ‘పల్లెప్రగతి’ పనుల అభివృద్ధి, వన నర్సరీలను పరిశీలించి మాట్లాడారు. 


డంపింగ్‌ యార్డు, స్మశానవాటిక స్థలాలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మురుగు కాలువలను పరిశీలించి సూచనలు చేశారు. ఆయనవెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రమే్‌షబాబు, జడ్పీటీసీ సేవ్యా, ఎంపీడీవో మసూద్‌శరీఫ్‌, తహసీల్దార్‌ ఖలీల్‌అహ్మద్‌, ఎస్‌ఐ నాగుల్‌మీరా, సర్పంచ్‌లు మర్రెడ్డి, పకీరానాయక్‌, ఎంపీవో నాగమణి, పంకజ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-03-04T11:51:41+05:30 IST