డిపో పురోగతికి ఉద్యోగులు పాటుపడాలి

ABN , First Publish Date - 2020-12-04T05:27:24+05:30 IST

డిపో పురోగతికి ఉద్యోగులందరూ పా టు పడాలని టీఎస్‌ ఆర్‌టీసీ నల్లగొండ రీజియన్‌ డీవీఎం శ్యామల అన్నారు.

డిపో పురోగతికి ఉద్యోగులు పాటుపడాలి
స్టార్‌ బ్యాడ్జీలు ధరించి విజయసంకేతం చూపుతున్న ఉద్యోగులు

నార్కట్‌పల్లి, డిసెంబరు 3 : డిపో పురోగతికి ఉద్యోగులందరూ పా టు పడాలని టీఎస్‌ ఆర్‌టీసీ నల్లగొండ రీజియన్‌ డీవీఎం శ్యామల అన్నారు. డిపోలో నవంబరు నెలకు గాను ఈపీకే, కేఎంపీఎల్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20మంది ఉద్యోగులకు గురువారం స్టార్‌ బ్యాడ్జీలు అందించారు. వారిలో 10మంది కండక్టర్లు, ముగ్గురు టీమ్‌ డ్రైవర్లు, ఏడుగురు డ్రైవర్లు ఉన్నారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ వివిధ అంశాల్లో నార్కట్‌పల్లి డిపో రీజియన్‌లోనే తొలి స్థానం లో ఉందని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎం పీ.నాగమల్లాచారి, ఎస్‌టీఐ నిర్మల, పీజేడీఐ భిక్షం తదితర ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:27:24+05:30 IST