ఖమ్మంలో రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-31T07:36:18+05:30 IST

ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం స్టేజి వద్ద జరిగింది.

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం

నకిరేకల్‌కు చెందిన డ్రైవర్‌ మృతి


ఖమ్మం రూరల్‌, అక్టోబరు 30: ఖమ్మం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లా వాసి మృతి చెందాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం స్టేజి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండలం రహమత్‌నగర్‌కు చెందిన షేక్‌ జావీద్‌ (37) మూడు నెలలుగా భువనగిరిలో ఉంటూ డీసీఎం డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు.   తవుడు లోడుతో దేవపూరి నుంచి రాజమండ్రికి వెళుతుండగా మార్గం మధ్యలో  ఏదులాపురం స్టేజి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ, డీసీఎంను ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎం క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన జావీద్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.  పోలీసులు డ్రైవర్‌ మృతదేహన్ని బయటకు తీసి ఖమ్మం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.  జావీద్‌ బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more