యాదాద్రి ఆలయ పనులపై సమీక్ష
ABN , First Publish Date - 2020-05-13T06:52:28+05:30 IST
దేశంలోనే అద్భుత ఆలయంగా పునఃనిర్మాణం, విస్తరణ చేస్తున్న యాదాద్రి క్షేత్ర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్

యాదాద్రి : దేశంలోనే అద్భుత ఆలయంగా పునఃనిర్మాణం, విస్తరణ చేస్తున్న యాదాద్రి క్షేత్ర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ కోరారు. కలెక్ట రేట్‌లో యాదాద్రి ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్‌లతో పనుల పురోగతిని సమీక్షించారు. పూర్తయిన పనులు, చేయాల్సిన పనుల వివరాలను అడిగితెలుసుకున్నారు. మిగిలిన పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలన్నారు.