రెవెన్యూ చట్టాలు ప్రక్షాళన చేయాలి

ABN , First Publish Date - 2020-03-12T07:04:33+05:30 IST

పేదల భూములు అన్యాక్రాంతం గాకుండా వారికి న్యాయం జరగాలంటే రెవెన్యూ చట్టాలు సమగ్ర ప్రక్షాళన జరగాలని

రెవెన్యూ చట్టాలు ప్రక్షాళన చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి


యాదాద్రి రూరల్‌, మార్చి11 : పేదల భూములు అన్యాక్రాంతం గాకుండా వారికి న్యాయం జరగాలంటే రెవెన్యూ చట్టాలు సమగ్ర ప్రక్షాళన జరగాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండంలోని కొత్తగుండ్లపల్లి గ్రామంలో పార్టీ జిల్లా కార్యదర్శిని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. భూముల ప్రక్షాళనతో రైతులు, పేదల భూము రికార్డులన్నీ తప్పుల తడకలా మారాయన్నారు. దీంతో పేద రైతులు తమ భూముల విషయంలో ఆందోళనకు గురవుతున్నారన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లను నిర్మించుకన్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు.


పేదల కు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రభుత్వం హామీ ఇచ్చి న నిరుద్యోగభృతి, ఇంటికో ఉద్యోగం అమలుకు త్వరలో ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి గోద శ్రీరాములు, రాష్ట్ర కమిటీ సభ్యుడు బొలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొల్లూరి రాజయ్య, మండల కార్యదర్శి బబ్బూరి శ్రీధర్‌, చెక్క వెంకటేశం, ఏశాల అశోక్‌, గ్యాదగాని మాణిక్యం, బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కళ్లెం కృష్ణ, గోద పెంటయ్య ఉన్నారు.

Updated Date - 2020-03-12T07:04:33+05:30 IST