సాగర్‌ 14 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2020-09-21T07:00:00+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఆదివారం వరద ప్రవాహం కొనసాగింది. శనివారం

సాగర్‌ 14 క్రస్ట్‌ గేట్ల నుంచి నీటి విడుదల

నాగార్జునసాగర్‌, చింతలపాలెం, దామ రచర్ల, సెప్టెంబరు 20: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఆదివారం వరద ప్రవాహం కొనసాగింది. శనివారం సాయంత్రం 20 గేట్ల నుం చి నీటిని విడుదల చేయగా, ఆదివారం ఉదయం 16 గేట్లు, మధ్యాహ్నం 14 గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి 2,07,970 క్యూసెక్కుల నీటిని దిగువ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,50,789 క్యూసెక్కుల మేర వరద సాగర్‌కు వస్తోంది. సాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.20 అడుగులుగా(310.6546 టీఎంసీ లు) ఉంది.


సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8604 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 2818, ఎస్‌ఎల్‌బీసీకి 1800, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 29597, 14 క్రస్ట్‌ గేట్ల నుంచి 2,07,970, మొత్తం 2,50, 789 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు (45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుత్తం 174.27అడుగులకు (44.64టీఎంసీలు) చేరింది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 2,56,950క్యూసెక్యుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు నీటి ని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పది క్రస్ట్‌ గేట్లను మూడు మీటర్లమేర ఎత్తారు. అడవిదేవులపల్లి శివారులోని టెయిల్‌పాండ్‌ వద్ద నీటి ఉధృతి పెరిగింది. సాగర్‌ నుంచి వరద భారీగా వస్తుండటంతో టెయిల్‌పాండ్‌ 18 గేట్ల నుంచి పులిచింతలకు 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-09-21T07:00:00+05:30 IST