శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతుకు రూ.6 కోట్లు విడుదల

ABN , First Publish Date - 2020-03-13T11:50:55+05:30 IST

జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతులకు మిషన్‌ కాకతీయ ఫేజ్‌ -4లో రూ.6 కోట్లు

శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతుకు రూ.6 కోట్లు విడుదల

ఈఈ రఘునాథ్‌ 


శాలిగౌరారం, మార్చి 12: జిల్లాలో మధ్య తరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్ట్‌ మరమ్మతులకు మిషన్‌ కాకతీయ ఫేజ్‌ -4లో రూ.6 కోట్లు మంజూరయ్యాయని జిల్లా నీటి పారుదలశాఖ ఈఈ ఎం.రఘునాథ్‌ప్రసాద్‌ తెలిపారు. గురువారం శాలిగౌరారం ప్రాజెక్ట్‌ను సందర్శించి ప్రా జెక్ట్‌ కట్ట, షట్టర్లను పరిశీలించారు. ప్రాజెక్ట్‌ మరమ్మతు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ బాలాజీనాయక్‌, ఏ ఈ పాండునాయక్‌, రాష్ట్ర ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు శ్యామల వెంకటరమణారెడ్డి, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ చిట్టిపాక శ్రవణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T11:50:55+05:30 IST