సాగర్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2020-10-03T10:40:35+05:30 IST

నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక తగ్గింది. దీంతో శుక్రవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను పది అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు తగ్గిన వరద

ఎనిమిది గేట్ల నుంచి నీటి విడుదల


నాగార్జునసాగర్‌, చింతలపాలెం, కేతేపల్లి, డిండి, శాలిగౌరారం, అక్టోబరు 2: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి వరద రాక తగ్గింది. దీంతో శుక్రవారం ప్రాజెక్టు ఎనిమిది గేట్లను పది అడుగులమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి 1,64,677 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.0405 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 589.20అడుగులుగా (309.6546 టీఎంసీలు) ఉంది. సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8642 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 5725, ఎస్‌ఎల్‌బీసీకి 1800, వరద కాల్వకు 600, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం నుంచి 29070, ఎనిమిది గేట్ల నుంచి 1,18,840, మొత్తంగా 1,64,677 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,28, 559క్యూసెక్కుల వరద వస్తుండగా, 1,57,077క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175అడుగులు (45.77టీఎంసీలు) కాగా, ప్రస్తు తం 174.27అడుగులుగా(44.64టీఎంసీలు) ఉంది. ప్రాజెక్టు ఆరు క్రస్ట్‌గేట్లను మూడు మీటర్లమేర ఎత్తారు.


మూసీకి ఇన్‌ఫ్లో నిలకడగా ఉంది. శుక్రవారం సాయంత్రానికి ఇన్‌ఫ్లో 2605క్యూసెక్కులుగా నమోదైంది. 645అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 644.10అడుగులు(4.22టీఎంసీలు)గా ఉంది. ప్రాజెక్టు రెండు క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డిండి రిజర్వాయర్‌కు వరద ప్రవాహం తగ్గింది. ఎగువ నుంచి 740 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతేమొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 36 అడుగుల(2.4 టీఎంసీ) వద్ద నిలకడగా ఉంది. శాలిగౌరారం ప్రాజెక్టు పూరి ్తస్థాయి నీటిమట్టం 21 అడుగుల వద్ద ఉండగా, కుడి, ఎడ మ కాల్వలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - 2020-10-03T10:40:35+05:30 IST