జాతీయ రహదారిపై తగ్గిన రద్దీ

ABN , First Publish Date - 2020-03-27T11:27:52+05:30 IST

కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులు, పోలీసుల నిర్బంధాలతో 65వ

జాతీయ రహదారిపై తగ్గిన రద్దీ

కేతేపల్లి/చిట్యాల రూరల్‌: మార్చి 26: కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తులు, పోలీసుల నిర్బంధాలతో 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై గురువారం వాహనాల రద్దీ తగ్గిపోయింది. వరుస సెలవులు, ఉగాది పండగ నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో వాహనాలు విరామం లేకుండా వెళ్లాయి. హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉంటున్న వారు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుతో బుధవారం జాతీయ రహదారిపై కొన్ని వాహనాలు కనిపించాయి.


ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో గురువారం జాతీయ రహదారి నిర్మానుష్యంగా కనిపించింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై వాహనాలను పోలీసులు గురువారం నిలిపివేశారు. స్వగ్రామాలకు వెళుతున్నామని వాహనదారులు వారిని బతిమిలాడటం కనిపించింది. కొంతమంది ద్విచక్ర వాహనదారులు పలు గ్రామాల శివార్ల నుంచి వెళ్లారు. తమ గ్రామ మీదుగా వాహనాలు వెళ్లవద్దని కోరుతూ చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన యువకులు గురువారం రోడ్డుకు అడ్డుగా కంచె వేశా

Updated Date - 2020-03-27T11:27:52+05:30 IST