పాలకుల వైఖరితో నష్టపోతున్న పేదలు

ABN , First Publish Date - 2020-11-19T05:49:01+05:30 IST

ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారు ఇచ్చిన హామీ లు, ప్రవేశపె ట్టిన పథకాలు అమలు కాక పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ఆరోపించారు.

పాలకుల వైఖరితో నష్టపోతున్న పేదలు

సీపీఎం కేంద్రకమిటీ సభ్యురాలు  పుణ్యవతి

రామన్నపేట, నవంబరు 18: ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారు ఇచ్చిన హామీ లు, ప్రవేశపె ట్టిన పథకాలు అమలు కాక పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని సీపీ ఎం కేంద్ర కమిటీ సభ్యురాలు ఎస్‌.పుణ్యవతి, ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ఆరోపించారు. మండలతంలోని కొమ్మాయిగూడెంలో బుధవారం  మహి ళల పరిస్థితులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. అనంతరం ఉపాధిహామీ కూలీలు, మహిళా సంఘాల సభ్యులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించారు. పలు విష యాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి  జహం గీర్‌, రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి జెల్లెల పెంటయ్య, కాటమయ్య, రవీందర్‌, పబ్బతి లింగయ్య, మీర్‌ఖాజాఅలీ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-19T05:49:01+05:30 IST