ప్రజాసేవకే ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-03-13T11:47:09+05:30 IST
తమను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసేందుకే మునిసిపల్ కౌన్సిలర్లు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు

భువనగిరి టౌన్, మార్చి12 : తమను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేసేందుకే మునిసిపల్ కౌన్సిలర్లు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు. పట్టణ పర్యావరణ అధ్యయనాల ప్రాంతీయ కేంద్రం, కేంద్ర గృహ, పట్టణ మం త్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టిన సమగ్ర సామార్థ్య పెంపుదల కార్యక్రమం (ఎన్‌యూఎల్‌ఎం)లో భాగం గా జిల్లాలోని 6మునిసిపాలిటీలకు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు భువనగిరిలో గురువారం నిర్వహించిన ఒక రోజు శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు.
ఐదేళ్ల పదవీ కాలంలో వార్డు అభివృద్ధికి మునిసిపల్, ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మునిసిపల్ సవరణ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. నాయకత్వ లక్షణాలు, బాధ్యత లు, కౌన్సిలర్ పాత్ర అంశంపై ఆర్‌సీయూఐఎస్ ఆచా ర్య వై.పార్థసారధి, డాక్టర్ ఎం.రామారావు, తెలంగాణ మునిసిపల్ చట్టం 2019పై ఆచార్య డి.రవింద్రప్రసాద్, పట్టణ ఇన్‌ఫార్స్‌ట్రక్చర్, బెంచిమార్చ్, తాగునీరు పారిశుధ్యంపై డాక్టర్ డి.సుధాకర్, ఆస్తిపన్ను సంస్కరణలు, ప్రభుత్వ గ్రాంట్స్‌పై డాక్టర్ కె.శ్రీనివాస్, తెలంగాణ బీపాస్ మాస్టర్ ప్లాన్‌పై ఇ.హరిప్రతాప్ అవగాహన కల్పించారు.
సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు. పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌తో శిక్షణ తరగతులు కొనసాగాయి. శిక్షణలో పాల్గొన్న కౌన్సిలర్లందరికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో జిల్లాలోని 6మునిసిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.