క్వారంటైన్ యూనిట్ ఏర్పాటుపై నిరసన
ABN , First Publish Date - 2020-03-24T11:50:31+05:30 IST
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో క్వారంటైన్ యూనిట్ వద్దని గ్రామస్థులు సోమవారం నిరసన వ్యక్తంచేశారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో

భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని జలాల్‌పూర్‌లో క్వారంటైన్ యూనిట్ వద్దని గ్రామస్థులు సోమవారం నిరసన వ్యక్తంచేశారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో అదనంగా క్వారంటైన్ యూనిట్ ఏర్పాటుకు కేటాయించిన వార్డును పరిశీలించేందుకు అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 60 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, ఈ సంఖ్య పెరిగితే భూదాన్‌పోచంపల్లి మండలం స్వామిరామానందతీర్థ గ్రామీణ సంస్థలో క్వారంటైన్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాట్లు సమీక్షించినట్లు తెలిపారు.
తమ గ్రామంలో క్వారంటైన్ యూనిట్ ఏర్పాటు చేయొద్దని సర్పంచ్ పర్నె రజితమల్లారెడ్డి గ్రామస్థులు ఆందోళన కొనసాగించటంతో అధికారులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసు బలగాలనేర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రాజు, తహసీల్దారు దశరథనాయక్, ఎంపీడీవో ఎ బాలశంకర్, ఆర్‌ఐ శోభ, ఎంపీవో జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.