పోరాటలతోనే సమస్యలు పరిష్కారం

ABN , First Publish Date - 2020-05-17T10:01:01+05:30 IST

పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ జిల్లా అధక్ష్యుడు చినలపాక లక్ష్మినారయణ అన్నారు.

పోరాటలతోనే సమస్యలు పరిష్కారం

నల్లగొండ రూరల్‌, మే 16: పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీఐటీయూ జిల్లా అధక్ష్యుడు చినలపాక లక్ష్మినారయణ అన్నారు. శనివారం ఆయన స్థానిక దొడ్డికొమరయ్య భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మిషన్‌ భగీరథ పనుల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడమే గాక అధికారులను ఎమ్యెల్యే భూపాల్‌రెడ్డి దుర్బాషలాడడాన్ని సీఐటీయూ ఖండిస్తుందన్నారు. మిషన్‌ భగీరథలో పనిచేస్తున్న కార్మికుల కోసం పోరాడుతున్న నాయకులను ఇష్టానుసారంగా దుర్బాషలాడటం సరికాదన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బోడ ఇస్తారి పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-17T10:01:01+05:30 IST