యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా ప్రవీణ్‌కుమార్
ABN , First Publish Date - 2020-03-02T11:31:58+05:30 IST
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స డిగ్రీ, పీజీ కళాశాల పూర్వ విద్యార్థి

భువనగిరి రూరల్, మార్చి1 : తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స డిగ్రీ, పీజీ కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ కె.ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స కళాశాలలో 1988-91వ సంవత్సరంలో బీఎస్సీ(బీజెడ్సీ) పూర్తి చేసుకున్న ఆయన ఓయూలో పోస్టు గ్రాడ్యూయేషన్ ఎంఎ్‌ససీ కెమిస్ర్టీ పూర్తి చేసి హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ డిగ్రీ పొందారు.
అనంతరం పదోన్నతిపై కామారెడ్డి ప్రిన్సిపాల్‌గా నియమించబడ్డారు. అదేవిధంగా ప్రస్తుతం ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. పాలకమండలి సభ్యుడిగా ఎన్నిక కావడంపై భువనగిరిలోని ఎస్‌ఎల్‌ఎన్‌ఎ్‌స కళాశాల పూర్వ విద్యార్థులు, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.