బ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై కూర్చుని నిరసన

ABN , First Publish Date - 2020-12-11T05:52:56+05:30 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల చేయాలని డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాక లింగయ్య డిమాండ్‌ చేశారు.

బ్యాడ్జీలు ధరించి, మోకాళ్లపై కూర్చుని నిరసన
కోదాడలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు

సూర్యాపేట, డిసెంబరు 10: ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్‌ విడుదల చేయాలని డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాక లింగయ్య డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని కుడకుడ ఉన్నత పాఠశాలలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా నడిగూడెం, తిరుమలగిరి, అనంతగిరి నల్లబ్యాడ్జీలు ధరించగా,  కోదాడలో మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేశారు. 

Updated Date - 2020-12-11T05:52:56+05:30 IST