గంజాయి విక్రయించే యువకుల అరెస్టు
ABN , First Publish Date - 2020-02-08T11:04:40+05:30 IST
నిషేధిత గంజాయి సేవిస్తూ, దానిని విక్రయించే ఇద్ద రు యువకులను సూర్యాపేట పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీఎస్పీ

సూర్యాపేటక్రైం, ఫిబ్రవరి 7: నిషేధిత గంజాయి సేవిస్తూ, దానిని విక్రయించే ఇద్ద రు యువకులను సూర్యాపేట పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డీఎస్పీ ఎం.నాగేశ్వర్‌రావు ఆదేశాలతో పట్టణ పోలీసులు పట్టణంలో ఉదయం సమయంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అందులో భాగంగా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాం తంలో పెట్రోలింగ్ చేస్తుండగా పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెంది న వొగ్గు శ్రీనాథ్, పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన మాతంగి మధు అనుమానస్పందంగా తారసపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయిని విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. వారి వాహనాలను తనిఖీ చేయగా సుమారు కిలో గంజాయి లభించింది. నిందితులను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకువెళ్లి విచారించారు. వొగ్గు శ్రీనాథ్‌కు సూర్యాపేటలోని బంధువుల నివాసం వద్ద మాతంగి మధు పరిచయమయ్యాడు. వొగ్గు శ్రీనాథ్‌కు పెన్‌పహాడ్ మండలం జల్మాల్‌కుంట తండాకు చెందిన భూక్య కళ్యాణ్, సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన చెందిన యర్కచర్ల మహేష్ స్నేహితులుగా మారారు. వారి నుంచి శ్రీనాథ్ గంజాయికి బానిసయ్యాడు. కళ్యాణ్, మహేష్ గంజాయిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వొగ్గు శ్రీనాథ్‌కు అప్పగించేవారు. దానిని శ్రీనాథ్ మాతంగి మధుకు విక్రయించేవాడు. ఇలా రోజూ కిలో గంజాయిని తీసుకొచ్చి వారు తాగడంతో పాటు ఇతరులకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. మాతంగి మధు, వొగ్గు శ్రీనాథ్, భూక్య కల్యాణ్, యర్కచర్ల మహే్‌షపై కేసు నమోదు చేశారు. శ్రీనాథ్, మధును రిమాండ్‌కు పంపారు. కళ్యాణ్, మహేష్ పరారీలో ఉన్నాట్లు సీఐ కె.శివశంకర్ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది కృష్ణయ్య, కర్ణాకర్, కె.సుధాకర్, యాదగిరి, చీకూరి మధు, కర్నాటి ఉపేందర్ పాల్గొన్నారు.