అందినకాడికి నొక్కుడే
ABN , First Publish Date - 2020-12-10T05:58:10+05:30 IST
మిర్యాలగూడ మండలంలోని కిందిస్థాయి పోలీసు సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు.

ఇసుక అక్రమ రవాణా, పశువుల సంతలో హోంగార్డుల హల్‌చల్
ఉన్నతాధికారులకు తెలియకుండానే వసూళ్ల పర్వం
మిర్యాలగూడ రూరల్, డిసెంబరు 9: మిర్యాలగూడ మండలంలోని కిందిస్థాయి పోలీసు సిబ్బంది వసూళ్ల పర్వానికి తెరలేపుతున్నారు. మూ సీనది నుంచి ఇసుక అక్రమ రవాణాపై వసూళ్లు, అవంతీపురం పశువుల సంతలో హల్‌చల్ చేస్తున్నారు. మూసీనది నుంచి రాత్రివేళ ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతుంది. సీఐ, ఎస్‌ఐలకు సమాచారం లేకుండానే సిబ్బందిలో కొందరు బైక్‌లపై నిత్యం గస్తీ కాస్తుంటారు. డ్యూటీల పేరుతో పోలీస్‌స్టేషన్‌కు సంబంధంలేని కార్లు ఉపయోగిస్తూ ఇసుక అక్రమంగా రవాణా చేసే వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం. అదే విధంగా అవంతీపురం మార్కెట్‌యార్డులో వారంలో రెండు రోజులు పశువుల సంత జరుగుతుంది. అక్కడ కొందరు వ్యక్తులు కాయ్ రాజా కాయ్ నిర్వహిస్తుండగా పోలీసులు చూసీ చూడనట్లు ఉండి వాటా లు నొక్కు తారని కొందరు బాహాటం గానే చర్చించు కుంటున్నారు. డబ్బులు నష్టపోయిన వారు అక్కడ జరిగే తంతును ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే వారిని అడ్డుకుంటారని, లేదంటే వారిపైనే తప్పుడు కేసులు పెట్టించేలా బయటి వారి మద్దతు తీసు కుంటారనే ఆరోపణ లున్నాయి. అవంతీపురం సంతలో పశువుల క్రయవిక్రయాలు సాగించేందుకు వచ్చే వ్యా పారులు పశువులు తరలించే క్రమంలో ఓహోంగార్డు హల్‌చల్ చేస్తుంటాడు. ఎక్కువ సంఖ్యలో పశువులు తరలించడం చట్టవిరుద్ధమని వారి నుంచి వసూళ్లకు పాల్పడుతుం టాడని అక్కడి వారు పేర్కొంటున్నారు. మరికొందరు సిబ్బంది మరో పద్ధతికి తెర లేపారు. పశువులు తరలించే చిన్నచిన్న వాహనాలను దారి మధ్యలో ఆపి సా యంత్రం వేళలో వసూలు చేస్తుంటారని విమర్శలున్నాయి. పోలీస్‌స్టేష న్ పరిధిలో జరిగే ఈ వసూళ్లపర్వం ఉన్నతాధికారులకు తెలియకుండా కింది స్థాయి సిబ్బందే సహకరించుకు ంటున్నారని ఆరోపణల ున్నాయి. దీనిపై రూరల్ ఎస్‌ఐ పి. పరమేష్ వివ రణ కోరగా ఈ విషయమై తమకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని, ఏదై నా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.