టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదు
ABN , First Publish Date - 2020-12-14T05:27:44+05:30 IST
టీఆర్‌ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాం సుందర్‌రావు అన్నారు.

తుర్కపల్లి, డిసెంబరు 13: టీఆర్‌ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాం సుందర్‌రావు అన్నారు. తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో వివిధ పార్టీల నుంచి పలువురు నాయకులు ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై అవగాహన లేకుండా పబ్లిసిటీ కోసమే టీఆర్‌ఎస్ కాంగ్రెస్ సీపీఎం నాయకులు రాస్తారోకోలు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమాల్లో నాయకులు దాసరి మల్లేశం, రాఘవుల నరేందర్, వేముల నరేందర్‌రావు, కొక్కొండ లక్ష్మీనారాయణ, కొలను చంద్రశేఖ ర్‌రెడ్డి, వేముల నరేష్, రంగ రామగౌడ్, జక్కల ఆనంద్‌గౌడ్, ఆరె కుమార్, చీర గణేష్ ఉన్నారు. దుబ్బాకతో ఉప ఎన్నిక ఫలితంతో టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుం దర్‌రావు అన్నారు. ఆత్మకూరు (ఎం)లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభా రాణితో కలిసి పార్టీ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలో నిర్మిస్తున్న రెండు పడకల ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో నాయకులు తడిసిన మల్లారెడ్డి, నాతి బిక్షపతి, రాఘవులు, టి.మురళీధర్‌రెడ్డి, నరేందర్, శ్యామ్, మొగులయ్య పాల్గొన్నారు. బీజేపీ లో చేరేందుకు యువత ఆసక్తి చూపుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు అన్నారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామానికి చెందిన యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో సురికంటి జంగారెడ్డి, వెంపటి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.