లాక్‌డౌన్‌ను విస్మరిస్తున్న జనం

ABN , First Publish Date - 2020-04-01T11:42:17+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేపట్టిన లాక్‌డౌన్‌ను జిల్లాలో మంగళవారం ప్రజలు పూర్తిగా విస్మరించినట్లు

లాక్‌డౌన్‌ను విస్మరిస్తున్న జనం

సూర్యాపేటటౌన్‌, మార్చి 31: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేపట్టిన లాక్‌డౌన్‌ను జిల్లాలో మంగళవారం ప్రజలు పూర్తిగా విస్మరించినట్లు కన్పించింది.  రోడ్లపై యథేచ్ఛగా తిరిగారు. ద్విచక్ర వాహనదారులు లాక్‌డౌన్‌ను ఏమాత్రం లేక్కచేయకుండా రహదారులపైకి వచ్చారు.  నిత్యావసర సరుకులను, మెడికల్‌ షాపులలో మందులు, కూరగాయల మార్కెట్‌ల వద్ద కొనుగోలు సమయాల్లో వినియోగదారులు భౌతికదూరం పాటించలేదు. కనీసం వ్యక్తికి వ్యక్తికి మధ్య మీటర్‌ దూరం  ఉండకుండా కొనుగోలు చేశారు.


రోడ్లపై ఎక్కడపడితే అక్కడే తోపుడు బండ్లపై పండ్లు అమ్ముతుండడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి గుమ్మిగూడారు. లాక్‌డౌన్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పలు స్వచ్ఛంద, వాసవిక్లబ్‌ ఆద్వర్యంలో వాటర్‌బాటిల్‌, బిస్కెట్‌లు, మజ్జిగ పంపిణీ చేశారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ 26వవార్డులో హైడ్రోక్లోరెడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. 26, 37, 38వార్డుల్లో  కౌన్సిలర్‌లు ప్రజలకు కూరగాయలు, బియ్యం, పాలు, సబ్బులు పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-01T11:42:17+05:30 IST