పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-06-19T07:37:18+05:30 IST

రూర్బన్‌ పథకం కింద కొండ భీమనపల్లి క్లస్టర్‌లో వివిధ శాఖలతో చేపట్టిన పెండింగ్‌ పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌

పెండింగ్‌ పనులు సకాలంలో పూర్తి చేయాలి

నల్లగొండ, జూన్‌ 18 : రూర్బన్‌ పథకం కింద కొండ భీమనపల్లి క్లస్టర్‌లో వివిధ శాఖలతో చేపట్టిన పెండింగ్‌ పనులు నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో నేషనల్‌ రూర్బన్‌ పథకం పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల్లో రూర్బన్‌ క్రిటికల్‌ గ్యాబ్‌ నిధులతో రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పెండింగ్‌ పను లు మార్చి 2021లోగా పూర్తి చేయాలన్నారు. స మావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌రెడ్డి, డీపీవో విష్ణువర్దన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణ య్య, మత్స్యశాఖ అధికా చరిత, పంచాయతీరాజ్‌ ఈఈలు మాధవి, తిరుపతయ్య పాల్గొన్నారు. 


పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

నల్లగొండ రూరల్‌ : పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో పల్లె ప్రగతి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతిలో చేపట్టిన వైకుంఠదామాల నిర్మాణం, డంప్‌ యార్డు, కంపోస్ట్‌ షెడ్ల నిర్మాణం,  భూ వివాదాలు, గ్రామ పంచాయతీ కరెంట్‌ బిల్లుల చెల్లింపుపై తహసీల్దార్లు,  పంచాయతీ అధికారులు, ట్రాన్స్‌కో డీఈ, ఏఈలతో మండలా ల వారీగా సమీక్షించారు. 

Updated Date - 2020-06-19T07:37:18+05:30 IST