నిబంధనల ఉల్లంఘింపుపై జరిమానా

ABN , First Publish Date - 2020-03-30T11:29:00+05:30 IST

హుజూర్‌నగర్‌లో మాంసం దుకాణాల వద్ద నిబంధనలు ఉల్లంఘించి, సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా

నిబంధనల ఉల్లంఘింపుపై జరిమానా

హుజూర్‌నగర్‌, మార్చి29 : హుజూర్‌నగర్‌లో మాంసం దుకాణాల వద్ద నిబంధనలు ఉల్లంఘించి, సామాజిక దూరం పాటించకుండా గుంపులుగా వచ్చిన జనాలకు మాంసం విక్రయించిన ముగ్గురు దుకాణదారులకు జరిమానా విధించినట్లు మునిసిపల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి తెలిపారు. పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీలో బీఫ్‌ మాంసం అమ్మే వ్యక్తితో పాటు ఇద్దరు చేపలు అమ్మే వ్యక్తులకు వెయ్యి రూ పాయల జరిమానా విధించినట్లు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మాంసం, చేపల దుకాణాలను సోమవా రం నుంచి ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌  తెలిపారు. మాంసం ఎక్కడ పడితే అక్కడ విక్రయించరాదని అన్నారు.

Updated Date - 2020-03-30T11:29:00+05:30 IST