టోకెన్లు లేకుండానే పత్తి లోడ్ల దిగుమతి

ABN , First Publish Date - 2020-11-27T05:59:28+05:30 IST

పత్తి మిల్లుల పెత్తనం, లో డు దిగుమతికి రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి స్వస్తి పలకాలని లక్ష్యంతో టోకెన్ల విధా నం తెచ్చినట్లు ప్రజాప్రతినిధులు చెప్పినా సిబ్బంది మా త్రం మధ్యమధ్యలో వాటికి తిలోదకాలిస్తున్నారని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు.

టోకెన్లు లేకుండానే పత్తి లోడ్ల దిగుమతి
చౌడంపల్లి వరలక్ష్మీ కాటన్‌మిల్లు వద్ద నిలిపి ఉన్న డీసీఎంలు

నార్కట్‌పల్లి, నవంబరు 26 : పత్తి మిల్లుల పెత్తనం, లో డు దిగుమతికి రోజుల తరబడి మిల్లుల వద్ద పడిగాపులు కాసే పరిస్థితికి స్వస్తి పలకాలని లక్ష్యంతో టోకెన్ల విధా నం తెచ్చినట్లు ప్రజాప్రతినిధులు చెప్పినా సిబ్బంది మా త్రం మధ్యమధ్యలో వాటికి తిలోదకాలిస్తున్నారని పత్తి రైతులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వరలక్ష్మి కాటన్‌ మిల్లులో గురువారం టోకెన్లు లేకుండానే దళారులు డీసీఎం ల్లో తెచ్చిన పత్తిని దిగుమతి చేసుకుని రైతులది పట్టించుకో వడం లేదని ఆరోపించారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఉన్న డీసీఎంలకే పత్తి దిగుమతికి అనుమతులు ఇచ్చామని కాటన్‌ మిల్లులో సీసీఐ, ఏఎంసీ సిబ్బంది చెప్పారు. నాణ్యత, రంగు లేని పత్తి కొనుగోలుకు నిరాకరించినందుకే సదరు కొందరు రైతులు తమ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నివర్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈనెల 27, 28 తేదీల్లో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు సిబ్బంది తెలిపారు.  

Updated Date - 2020-11-27T05:59:28+05:30 IST