పశువైద్యశాలల్లో మందులకు కొరతలేదు

ABN , First Publish Date - 2020-11-25T06:05:48+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో మందులకు కొరతలేదని పశుసంవర్థకశాఖ, మత్స్యఅభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్‌ అనితరాజేంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పశుపోషకుల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు.

పశువైద్యశాలల్లో మందులకు కొరతలేదు
డిండిలో మాట్లాడుతున్న పశుసంవర్థకశాఖ, మత్స్యఅభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్‌ అనితరాజేంద్ర

పశుసంవర్థకశాఖ, మత్స్య అభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్‌ అనితరాజేంద్ర

డిండి, నవంబరు 24: తెలంగాణ రాష్ట్రంలోని పశువైద్యశాలల్లో మందులకు కొరతలేదని పశుసంవర్థకశాఖ, మత్స్యఅభివృద్ధిశాఖ రాష్ట్ర కమిషనర్‌ అనితరాజేంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పశుపోషకుల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. పశువైద్యశాలల్లో మందులకొరత ఏర్పడితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. పశువులు, గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబరు నెలలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దేవరకొండ డివిజన్‌లో పశువులకు లంపి చర్మవ్యాధి వ్యాప్తి చెందుతోందని, దీని నివారణకు ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. డిసెంబరు 1న గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌ మాట్లాడుతూ, వేసవి మొదలుకాకముందే పాలశీతలీకరణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో పశుసంవర్థకశాఖలో పనిచేసే అధికారులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు డిండి రిజర్వాయర్‌లో తొలి విడత 3.18కోట్ల రొయ్యపిల్లలను వదిలారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ డైరెక్టర్‌ వంగాల లక్ష్మారెడ్డి, మత్స్య అభివృద్ధి జిల్లా అధికారి చరిత, నార్మాక్స్‌ ఎండీ రమేష్‌, ఆర్డీవో గోపిరాం, ఎంపీపీ మాధవరం సునిత జనార్ధన్‌రావు, తహసీల్దార్‌ పుష్పలత, ఎంపీడీవో గిరిబాబు, జేడీ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Read more