పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఆదర్శప్రాయుడు

ABN , First Publish Date - 2020-11-21T06:23:07+05:30 IST

దివంగత నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అందరికీ ఆదర్శనీయుడని, నేటితరం నాయకులు రాజకీయాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసీసీ సభ్యురాలు, ఆయన తనయ పాల్వాయి స్రవంతీరెడ్డి అన్నారు.

పాల్వాయి గోవర్దన్‌రెడ్డి ఆదర్శప్రాయుడు
గోవర్దన్‌రెడ్డి జయంతి వేడుకల్లో మాట్లాడుతున్న స్రవంతీరెడ్డి

ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతీరెడ్డి

చండూరు, నవంబరు20 : దివంగత నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి అందరికీ ఆదర్శనీయుడని, నేటితరం నాయకులు రాజకీయాల్లో ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏఐసీసీ సభ్యురాలు, ఆయన తనయ పాల్వాయి స్రవంతీరెడ్డి అన్నారు. గోవర్దన్‌రెడ్డి 85వ జయంతి ని పురస్కరించుకొని శుక్రవారం ఆమె చండూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లర్పించి మాట్లాడారు.  గోవర్దన్‌రెడ్డి యువజన కాంగ్రెస్‌లో రాజకీయ ఆరంగే ట్రం చేసి దేశంలోనే అత్యున్నత నాయకుడిగా ఎదిగాడన్నారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని పేర్కొన్నారు.  పట్టణ అధ్యక్షుడు దోటి వెంకటేష్‌యాదవ్‌ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పాల్వాయి తనయులు మాజీ సర్పంచ్‌ శ్రవణ్‌ కుమార్‌రెడ్డి, డాక్టర్‌ క్షంతన్‌రెడ్డి, మునిపిపల్‌ చైర్మెన్‌ తోకలి చంద్రకళావెంకన్న, మది విఠల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పాల్వాయి రాంరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు

మర్రిగూడెం : పాల్వాయి గోవర్దన్‌రెడ్డి జయంతిని కాంగ్రెస్‌ నాయకులు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ ఉపాధ్యక్షుడు పొనుగోటి విద్యారామారావ్‌ మాట్లాడుతూ ఆయన చేసిన సే వలను కొనియాడారు, కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, సర్పంచ్‌లు శ్రీనివాసారెడ్డి, పాక నగేష్‌, అనిల్‌రెడ్డి, మాస శేఖర్‌, వెంకటయ్య, జగాల్‌రెడ్డి, శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more