‘రాజకీయ లబ్ధి కోసమే వ్యతిరేకిస్తున్నారు’

ABN , First Publish Date - 2020-12-26T04:58:58+05:30 IST

రైతాంగం మేలు కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, టీఆర్‌ఎ్‌సలు రాజకీయ లబ్ధి కోసమే వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎ్‌స ప్రభాకర్‌ ఆరోపించారు.

‘రాజకీయ లబ్ధి కోసమే వ్యతిరేకిస్తున్నారు’
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభాకర్‌

ఆత్మకూరు (ఎం), డిసెంబరు 25: రైతాంగం మేలు కోసం తెచ్చిన వ్యవసాయ చట్టాలను కాంగ్రెస్‌, కమ్యూనిస్టు, టీఆర్‌ఎ్‌సలు రాజకీయ లబ్ధి కోసమే వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎ్‌స ప్రభాకర్‌ ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతాంగాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని రైతులకు వినిపించడానికి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవడానికి ఈ చట్టాలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింగ్‌రావు, దాసరి మల్లేశం, ధనంజయ్‌, రవీందర్‌, తడిసిన మల్లారెడ్డి, నాతి భిక్షపతి, వీరారెడ్డి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-26T04:58:58+05:30 IST