మహిళ నుంచి ఫోన్.. తరచూ చాటింగ్.. చెప్పింది నిజమని నమ్మి.. రూ.11 లక్షలు..
ABN , First Publish Date - 2020-07-08T21:25:00+05:30 IST
గుర్తుతెలియని వ్యక్తులు నల్లగొండ జిల్లా చిట్యాలలో ఓ వ్యక్తికి ఫోన్లో పరిచయమై రూ.11లక్షలు కాజేశారు. చిట్యాలకు చెందిన నాగిళ్ల లక్ష్మణ్‌రావు

ఫోన్ చేసి.. లక్షలు కాజేశారు
నల్లగొండ జిల్లా చిట్యాలలో ఘటన
చిట్యాల (నల్లగొండ జిల్లా): గుర్తుతెలియని వ్యక్తులు నల్లగొండ జిల్లా చిట్యాలలో ఓ వ్యక్తికి ఫోన్లో పరిచయమై రూ.11లక్షలు కాజేశారు. చిట్యాలకు చెందిన నాగిళ్ల లక్ష్మణ్‌రావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పని చేస్తున్నాడు. గత జనవరిలో ఆయన ఫోన్‌కు ఓ మహిళ ఫోన్ చేసి తన పేరు తామరా బెన్సెట్టి అని, లండన్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో విదేశీ వ్యవహారాల శాఖలో పని చేస్తున్నానని పరిచయం చేసుకుంది. లక్ష్మణ్‌రావు కుటుంబం గురించి వివరాలు తెలుసుకుని పరిచయం పెంచుకుని తరుచూ చాటింగ్ చేసేది.
ఈ క్రమంలో తమ బ్యాంకులో ఖాతా ఉన్న వ్యక్తి ఒకరు మరణించారని అతడి ఖాతాలో 9,600 మిలియన్ డాలర్ల ఉన్నాయని, వాటిని డ్రా చేసుకోవడానికి సహకరించాలని కోరింది. దీని కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి రూ.96వేలు (1,350 యూఎస్ డాలర్లు) వేయాలని కోరింది. ఇలా వివిధ పనుల కోసమని విడతల వారీగా ఆరుసార్లుగా రూ.7.83 లక్షలు ఖాతాలో జమ చేయించుకుంది. అదే విధంగా మరో ఇద్దరు మహిళలు కూడా డబ్బులు పంపమనడంతో రూ.3,13,600 ఖాతాలోవేశాడు. తర్వాత వారి ఫోన్లు స్విచ్ఆఫ్ చేయడంతో, మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.