విస్తరణ పనులకు ఏడాది.. 322 దుకాణాల కూల్చివేత

ABN , First Publish Date - 2020-07-27T18:05:01+05:30 IST

సూర్యాపేట జిల్లాకేంద్రంలోని పాత జాతీ య రహదారి (మెయిన్‌ రోడ్డు) విస్తరణ పనులు స్టేతో నిలిచిపోయాయి. ఆరు నెలల్లో కావాల్సిన పను లు సంవత్సరమవుతున్నా పూర్తి కావడంలేదు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన 56మంది బాధితులు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దీం తో పనులు నిలిచిపోయాయి.

విస్తరణ పనులకు ఏడాది.. 322 దుకాణాల కూల్చివేత

(సూర్యాపేట, ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లాకేంద్రంలోని పాత జాతీ య రహదారి (మెయిన్‌ రోడ్డు) విస్తరణ పనులు స్టేతో నిలిచిపోయాయి. ఆరు నెలల్లో కావాల్సిన పను లు సంవత్సరమవుతున్నా పూర్తి కావడంలేదు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన 56మంది బాధితులు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దీం తో పనులు నిలిచిపోయాయి. జిల్లా కేంద్రంలోని పీసీఆర్‌ సెంటర్‌ నుంచి జమ్మిగడ్డ వరకు పనులు జరుగుతున్నాయి. పాత మెయిన్‌ రోడ్డు అభివృద్ధికి పనులు చేపట్టారు. రోడ్డు విస్తర ణ ఆధునికీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం టీయూవీఎఫ్‌ఐడీసీ కింద రూ.28.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల్లో రూ.10కోట్లకు టెండర్లు కూడా పూర్తయ్యా యి. ఈ నిధులతో మురుగు కాల్వలు, సెంట్రల్‌ లైటింగ్‌, పుట్‌పాత్‌, గ్రీనరీ, డివైడర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు.


విస్తరణ పనులు ఆగిపోవడంతో వీధులు గుంతలమయంగా మారాయి. వర్షకాలంలో ఆ రోడ్డు గుండా వెళ్లాలంటే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటి వరకు పోస్టాఫీస్‌ నుంచి తేజ మూవీ మ్యాక్సీ వరకు రోడ్ల విస్తరణ పూర్తిఅయింది. పోస్టాఫీస్‌ నుంచి తేజ మూవీ మ్యాక్సీ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మిస్తున్నారు. మెయిన్‌ రోడ్డులో ఓపెన్‌ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి దానిపైన స్లాబ్‌ వేసి పుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ డివైడర్‌ను నాలుగు అడుగుల వెడల్పు తో నిర్మిస్తున్నారు. డివైడర్‌పైనే వీది దీపాలు అమరుస్తారు. కాల్వ, పుట్‌పాత్‌ 12 అడుగుల మేర ఉంటుంది. వర్షపు నీరు భూమిలో ఇంకేందుకు హార్వేస్టింగ్‌ పిట్స్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. 


322 దుకాణాల కూల్చివేత

మెయిన్‌ రోడ్డు విస్తరణలో 322దుకాణాలను కూల్చివేశారు. కొన్ని దుకాణాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. కొన్నిపాక్షికంగా దెబ్బతిన్నాయి. దుకాణాల వెనక కూడా స్థలం ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. 100 దుకాణాల దాకా కేవలం 5నుంచి 7అడుగుల స్థలం మాత్రమే మిగిలింది. సూర్యాపేట మెయిన్‌ రోడ్డులో పూలు, బుట్టలు, పండ్లు, అపరాలు అమ్మే వారు అనేక మంది ఉన్నారు. రోజు వారీగా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు దుకాణాలు కోల్పోయి ఉపాధి కరువైంది. మరికొంత మంది వ్యాపారులు వేరే రోడ్డులో దుకాణాలు అద్దెకు తీసుకున్నారు. సంవత్సరం పూర్తవుతున్నా పనులు ముందుకు సాగడం లేదని కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో కూడా నిరసన తెలిపారు.


ఇబ్బందులు పడుతున్న వాహనదారులు: బైరు శైలేందర్‌, కౌన్సిలర్‌

రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోవడంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. కాస్త చినుకు పడితే నీరు నిలిచి వాహనదారులు అవస్థ లు పడుతున్నారు. కాస్త ఆదా మరిచినా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. 



పనులు త్వరగా పూర్తిచేయాలి: కర్నాటి కిషన్‌, బాధితుడు

రోడ్డు విస్తరణ పనులను త్వర గా పూర్తి చేయాలి. రోడ్డు విస్తరణ లో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలి. డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇండ్లు కేటాయించాలి. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో దుకాణాలు కేటాయించాలి.



స్టేతో పనుల్లో జాప్యం: రామానుజులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌

కొంత మంది బాధితులు కోర్టు నుంచి స్టే తెచ్చుకోవడంతో పనులు నిలిచిపోయాయి. పీఎస్‌ఆర్‌ సెంటర్‌ నుంచి జమ్మిగడ్డ వరకు పనులు సాగుతున్నాయి. వీలైనంత త్వరలో రోడ్డు విస్తరణ పనులు చేపడుతాం. దీనికి ప్రజలు సహకరించాలి. 


Updated Date - 2020-07-27T18:05:01+05:30 IST