రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ABN , First Publish Date - 2020-03-08T11:26:42+05:30 IST
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ శనివారం మృతిచెందా డు. సూర్యాపేట పట్టణం కుడకుడకు చెందిన జక్క లి

చివ్వెంల, మార్చి 7: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ శనివారం మృతిచెందా డు. సూర్యాపేట పట్టణం కుడకుడకు చెందిన జక్క లి రమేష్(28) కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతని స్నేహితుడు నరేష్ పనినిమిత్తం కారులో కోదాడకు వెళ్లి సూర్యాపేటకు తిరుగుపయనమయ్యారు. అది సాంకేతిక లోపం రావడంతో ద్విచక్ర వాహనంపై బ యలుదేరారు. ఉండ్రుకొండ వద్దకు రాగానే గేదెలు అడ్డురావడంతో వాటిని తప్పించబోయి డివైడర్‌ను బై క్ ఢీకొట్టింది.
రమేష్, నరే్‌షకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రమేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు హైద్రాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో రమేష్ మృతిచెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ లవకుమార్ తెలిపారు.