ప్రజల ప్రాణాలకు రక్షణేదీ

ABN , First Publish Date - 2020-07-22T10:52:13+05:30 IST

రాష్ట్రంలో కరోనాతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అఽధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. మంగళవారం

ప్రజల ప్రాణాలకు రక్షణేదీ

కరోనాపై సీఎం నిర్లక్ష్య వైఖరి :  ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌


నకిరేకల్‌, జూలై 21: రాష్ట్రంలో కరోనాతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ ఇంటిపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని తాటికల్‌ గ్రామంలో ఓయూ నిరుద్యోగ పరిశోధక విద్యార్థి ఫ్రంట్‌ చైర్మన్‌ చనగాని దయాకర్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్లు, జర్నలిస్టులు మృతిచెందుతు న్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు.


ఆయన నిర్లక్ష్యం వల్లే ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దయాకర్‌ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రం కోసం ఓయూ విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేశారని, నిరుద్యోగులు, ప్రజలపట్ల సీఎం నిర్లక్ష్య వైఖరి సరికాదన్నారు. కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి కార్పొరేట్‌ వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, ఓయూ విద్యార్థులు దోరెపల్లి నాగరాజు, రవి, కార్తిక్‌, స్టాలిన్‌, శ్రీను, రైతు కూలీ పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మకంటి కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-22T10:52:13+05:30 IST