రైతుల సంక్షేమంలో
ABN , First Publish Date - 2020-11-13T10:50:19+05:30 IST
రైతులకు సంక్షేమ పథకాలు అమలుచేయడంలో రాష్ట్రానిది అగ్రస్థానమని శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు.
రాష్ట్రం అగ్రస్థానంలో
శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి
నల్లగొండ, నవంబరు 12: రైతులకు సంక్షేమ పథకాలు అమలుచేయడంలో రాష్ట్రానిది అగ్రస్థానమని శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు పథకాలు అమలవుతున్నాయన్నారు. పంట దిగుబడి సమయంలో అకాలవర్షాల కారణంగా పత్తి, వరి దెబ్బతిన్నాయన్నారు. ధాన్యం, సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, .రైతులు ఓపికపట్టి మద్దతు ధరకు విక్రయించాలన్నారు. మిర్యాలగూడలోని 66 మిల్లులలో సన్నరకం ధాన్యం కొనుగోలు జరుగుతోందన్నారు. రైతులంతా ఒకేసారి వస్తుండటంతో ఇబ్బందులు ఏర్పడటంతో రోజుకు 1500 ట్రాక్టర్లను అనుమతించేలా టోకెన్లు ఇస్తున్నారన్నారు.
క్వింటాకు రూ.1800 ధర రైతులకు దక్కుతోందన్నారు. రైతులు ప్రభుత్వానికి సహకరించాలని, ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకురావాలన్నారు. నకిరేకల్-నాగార్జునసాగర్ వరకు 565 జాతీయరహదారి నిర్మాణం కోసం రూ.421కోట్లతో త్వరలో టెండర్లు పిలవనున్నట్టు చెప్పారు. 85కి.మీ మేరకు రహదారి నిర్మాణం ఉంటుందని, నల్లగొండలోని పానగల్లు వద్ద వెహికిల్ అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అంతా కొవిడ్ నిబంధనలను పాటిస్తూ దీపావళి వేడుకలు చేసుకోవాలని కోరుతూ ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.