రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమిస్తాం

ABN , First Publish Date - 2020-12-06T05:24:42+05:30 IST

కార్పొరేట్‌, దళారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమనికి మద్దతుగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు.

రైతు వ్యతిరేక చట్టాల రద్దుకు ఉద్యమిస్తాం
నల్లగొండలో మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట్‌రెడ్డి

 సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
నల్లగొండ రూరల్‌, డిసెంబరు 5 :  కార్పొరేట్‌, దళారులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమనికి మద్దతుగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా కౌ న్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతాంగ ఉద్యమానికి దేశమంతా అండగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులను చర్చలకు పిలిపించి చట్టాలను సవరించాలని డిమాండ్‌ చేశా రు. సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో రైతు లు, ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌లో మరి న్ని పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు పబ్బు వీరస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నా యకులు నర్సింహారెడ్డి, రత్నాకర్‌రావు, ఆదిరెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
మిర్యాలగూడ : ఢిల్లీలో తొమ్మిది రోజులుగా రైతులు చేపడుతున్న ఆం దోళనకు సంఘీభావంగా వామపక్షాల నాయకులు శనివారం స్థానిక సా గర్‌రోడ్డులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భం గా ఏఐకెఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక, విద్యుత్‌ చట్టాలతో వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణకు యత్నిస్తోందన్నారు. దీన్ని గ్రహించిన రైతులు పెద్దఎత్తున ఢిల్లీపై పోరాటానికి సిద్ధపడ్డారన్నారు. ఇప్పటికే పోరాటంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినా కేంద్రం చలించడం లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతు ప్రతినిధులతో చర్చించి  రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రవినాయక్‌, మల్లు గౌతంరెడ్డి, రాంమ్మూర్తి, సీతారాములు, మోహన్‌నాయక్‌, మల్లయ్య, సోమయ్య, సైదమ్మ, గోపి, కొండల్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.
టీఎ్‌సయూటీఎఫ్‌ సంఘీభావ ప్రదర్శన
ఢిల్లీలో రైతులు చేస్తున్న వీరోచిత పోరాటానికి సంఘీభావంగా టీఎ్‌సయూటీఎఫ్‌, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతు సంఘీభావ ప్రదర్శన నిర్వహి ంచాయి. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నాయకులు సంఘం రాష్ట్ర కార్యదర్శి జి.నాగమణి, పి.సత్యనారాయణ, సభ్యులు బక్కా శ్రీనివాసచారి, రమణారెడ్డి, మోర్తాల శ్రీనివా్‌సరెడ్డి, లచ్చయ్య పాల్గొన్నారు.
భారత్‌ బంద్‌కు జీజేఎస్‌ సంపూర్ణ మద్దతు
నల్లగొండ క్రైం : రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 8న  చేపట్టిన భారత్‌ బంద్‌కు టీజేఎస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పన్నాల గోపాల్‌రెడ్డి తెలిపారు. పార్టీ కార్యాలయ ంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ంలో మోడీ తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చే యాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన శ్రీధర్‌, ఉపాధ్యక్షుడు యాదయ్య, కార్యదర్శులు పులి పా పయ్య, క్రాంతికుమార్‌, ధీరావత్‌ వీరూనాయక్‌ పాల్గొన్నారు.
వేములపల్లి : కేంద్రం తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ మండల కేంద్రంలో రైతు సంఘం, సీపీఎం నాయకులు శనివారం ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా నాయకుడు పాల్వాయి రాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి పాదూరి శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సాయిలు, సైదులు, వెంకన్న, భిక్షం పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:24:42+05:30 IST