రైతు భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు

ABN , First Publish Date - 2020-07-18T10:53:33+05:30 IST

రైతు వేదిక భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు

రైతు భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం తగదు

మద్దిరాల, జూలై 17:  రైతు వేదిక భవన నిర్మాణాలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మద్దిరాలలో రైతు వేదిక భవన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. నిర్మాణానికి సామగ్రిని త్వరలో తెప్పించుకుని నాణ్యతతో నిర్మించాలని కోరారు. దసరా లోపు నిర్మాణాలను పూర్తి చే యాలని కోరారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం వీటిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రజాక్‌, ప్రకాష్‌, ప్రభాకర్‌, రాంప్రసాద్‌, సరోజ, రాజేష్‌, సర్పంచ్‌ ఇంతియాజ్‌బేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-18T10:53:33+05:30 IST