నర్సన్నా.. నిను మరువం
ABN , First Publish Date - 2020-12-14T05:23:39+05:30 IST
నోముల నర్సింహయ్య కార్మిక, కర్షక పక్షపాతిగా నిలిచారని ప్రజాప్రతినిధులు కొనియాడారు.

సంతాప సభలొ పాల్గొన్న జిల్లా నేతలు
హాలియా, డిసెంబరు 13 : నోముల నర్సింహయ్య కార్మిక, కర్షక పక్షపాతిగా నిలిచారని ప్రజాప్రతినిధులు కొనియాడారు. దివంగత నేత, సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహ య్య సంతాపసభకు శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరై ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నోముల చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఉన్నంత కాలం కార్మిక, కర్షక పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. రాంచందర్‌నాయక్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, రవీంద్రకుమార్, జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, కర్నె ప్రభాకర్, రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, బీసీ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ పెద్దులు, కొండూరు సత్యనారాయణ, నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మి, కుమారుడు భగత్, నాయకులు విజయేందర్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, చైర్మన్లు వెంపటి పార్వతమ్మ శంకరయ్య, సైదిరెడ్డి, నాయకులు హన్మంతరావు, కృ ష్ణారెడ్డి, అంజయ్య, మహేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, బ్రహ్మారెడ్డి, రంజిత్‌యాదవ్, వెం కట్‌రెడ్డి, ఎంపీపీలు భగవాన్‌నాయక్, జయమ్మ, వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, సత్యపాల్, నాగయ్య, నరేందర్, చెన్నారెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు నోముల పేరు పెట్టాలి
నూతనంగా మంజూరైన నెల్లికల్లు లిప్టు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం దివంగత నేత నోముల నర్సింహయ్య కృషి చేశారని వాటికి ఆయన పేరు పెట్టాలని పలువురు వక్తలు సూచించగా దానికి మంత్రి జగదీ్‌షరెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
అండగా ఉంటామని భరోసా
నోముల సంతాప సభలో మాట్లాడిన మంత్రి జగదీ్‌షరెడ్డి నోముల కుటుంబాన్ని తన కుటుంబంతో సమానంగా చూసుకుంటానని అన్నారు. మండలి చైర్మన్ గుత్తా వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. మాట్లాడిన ఇతర మంత్రులు, వక్తలు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కదిలించిన పాటలు
నోములపై సాయిచంద్ ఆలపించిన పాటలు పలువురి హృదయాన్ని కదిలించి కంటతడి పెట్టించాయి. సంతాప సభలో వారు పాడిన పాటలతో కార్యకర్తలు, అభిమానులు నర్సింహయ్య జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.
తరలిన అభిమానులు, కార్యకర్తలు
హాలియా / నిడమనూరు / నాగార్జునసాగర్ : ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సంతాప సభకు హాలియా, నిడమ నూరు, సాగర్ నుంచి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎ త్తున తరలివచ్చారు. తరలివెళ్లిన వారిలో బొల్లం జయ మ్మ, విరిగినేని అంజయ్య, కామర్ల జానయ్య, చేకూరి హన్మంతరావు, పోలే డేవిడ్, తాటి సత్యపాల్, బొల్లం రవి, రామ ంజయ్య, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, గుర్వయ్య, గోవర్దన్, సాగర్ ను ంచి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయ కు లు తరలివెళ్లారు. ఆపరేషన్ నర్సన్న యువసేన ఆధ్వర్యంలో వలంటీర్లు సేవలు నిర్వహించారు. నోముల సంతాప సభకు మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, హాలియా సీఐ వీరరాఘవులు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.