నల్లగొండలో రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-10T13:29:42+05:30 IST
జిల్లాలోని అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది.

నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలం ఈశ్వర్‌నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు పెద్దవూర మండలం కొత్తలూరుకు చెందిన శ్రవణ్(28), నవీన్(16)గా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.