ఆస్తికోసం బాలికను బంధించి చిత్రహింసలు

ABN , First Publish Date - 2020-11-19T12:48:35+05:30 IST

ఆస్తి కోసం మైనర్​ బాలికను బంధించి చిత్రహింసలు గురి చేసిన ఘటన జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది.

ఆస్తికోసం బాలికను బంధించి చిత్రహింసలు

నల్లగొండ: ఆస్తి కోసం మైనర్​ బాలికను బంధించి చిత్రహింసలు గురి చేసిన ఘటన జిల్లాలోని మిర్యాలగూడలో చోటు చేసుకుంది.  బాలిక చిన్నమ్మ ఓ వ్యక్తితో కలిసి చిన్నారిని 11 రోజుల పాటు గదిలో బంధించి తీవ్రంగా హింసించింది. ఈ నెల 8న బాధిత కుటుంబ సభ్యులు వన్​టౌన్​ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో గత రాత్రి బాలికను ఆమె చిన్నమ్మ ఇంటివద్ద వదిలేసింది. వెంటనే వన్ టౌన్ పోలీసులు బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-11-19T12:48:35+05:30 IST