పోలీసుల పేరుతో ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్.. ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-01T17:12:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల పేరుతో ఫేస్‌బుక్ నకిలీ అకౌంట్.. ముఠా అరెస్ట్

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల పేరుతో ఫేస్‌బుక్‌ నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎస్పీ రంగనాథ్‌ నేతృత్వంలో వారం రోజుల పాటు ఆపరేషన్ కొనసాగింది. రాజస్థాన్‌లోని బర్కత్‌పురలో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో సైబర్ నేరగాడి దగ్గర కిలోల కొద్ది సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 236 మంది పోలీసుల పేరుతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. చివరకు నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ను కూడా వదలలేదు. దీంతో ముఠా ఆటకట్టించేందుకు  ఎస్పీ రంగనాథ్‌ స్వయంగా రంగంలోకి దిగారు. సైబర్‌ ముఠా ఏడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.  

Updated Date - 2020-10-01T17:12:59+05:30 IST