జనతా కర్ఫ్యూ సఫలం

ABN , First Publish Date - 2020-03-23T10:38:38+05:30 IST

జనతా కర్ఫ్యూ సఫలం

జనతా కర్ఫ్యూ సఫలం

 చప్పట్లతో సంఘీభావం తెలిపిన ప్రజలు 

నల్లగొండ అర్బన్‌, మార్చి 22: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో ఆదివారం ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేశారు. పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమయ్యారు. రోడ్లు, కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. పిల్లలు ఇళ్ల నుంచి బయటకి వెళ్లకుండా  వారికి తోచిన ఆటలు ఆడుకున్నారు. టీవీలకు, సెల్‌ఫోన్‌లకే పరిమితమయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎలిశాల కాలనీలో సాయంత్రం 5 గంటలకు కాలనీ వాసులంతా బయటకు వచ్చి ఒకచోట నిలబడి చప్పట్లు కొడుతూ వైద్య సిబ్బందికి, పోలీ్‌సశాఖకి, జర్నలిస్టులకు పారిశుధ్య కార్మికులకు మద్దతు తెలిపారు. చిన్నపిల్లలు, పెద్దలు సహా అంతా బయటకు వచ్చి చప్పట్లు కొట్టారు. కార్యక్రమంలో కాలనీ వాసులు బచ్చు మురళి, కోటగిరి దైవాదీనం, శివకోటి నెహ్రూ, కొండకింది సత్తిరెడ్డి, గంట్ల శ్రీనివా్‌సరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


కనగల్‌: కనగల్‌ మండలంలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉంటే ఎక్స్‌రోడ్డు నిర్మానుష్యంగా మారింది.  పోలీసులు దర్వేశిపురం, కనగల్‌ ఎక్స్‌రోడ్డు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయం త్రం 5గంటలకు ఎంపీపీ కరీంపాష కుటుంబ సభ్యులతో పాటు, ప్రజలు వారి ఇంటి ఆవరణలో చప్పట్లు కొట్టి సంఘీభావం వ్యక్తం చేశారు. 


దర్వేశిపురంలో ఫంక్షన్‌హాల్‌ సీజ్‌ 

మండలంలోని దర్వేశిపురం గ్రామ స్టేజీ వద్ద ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఓ వివాహ వేడుక జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ శ్రీనివా్‌సరావు, ఎస్‌ ఐ సతీ్‌షరెడ్డి ఇతర అధికారులు ఫంక్షన్‌ హాల్‌ అద్దెకు ఇచ్చి నిబంధనలు ఉల్లఘించిన కారణంగా పంక్షన్‌ హాల్‌ గేటుకు తాళాలు వేసి సీజ్‌ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఫంక్షన్‌ హాల్‌ను తెరవకూడదని యజమా నిని హెచ్చరించారు. అప్పటికే పెళ్లి తంతు ముగియటం తో అక్కడున్న జనాలను అక్కడి నుంచి వెళ్లిపోయారు. 


ట్రాఫిక్‌ పోలీసుల క్లాప్స్‌

నల్లగొండ: జనతా కర్ఫ్యూ పిలుపులో భాగంగా సా యంత్రం 5 గంటల సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు ప ట్టణంలోని గడియారం సెంటర్‌లో చప్పట్లు కొట్టారు. వై ద్యుల వైద్య సేవలను హర్షిస్తూ ట్రాఫిక్‌ సీఐ అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో మెడికల్‌ సిబ్బందికి మద్దతు తెలిపా రు. అన్నెపర్తిలోని 12వ బెటాలియన్‌లో కమాండెంట్‌  సాంబయ్య ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు. 


తిప్పర్తి: మండలంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వ చ్ఛందంగా పాల్గొన్నారు. మండలంలోని ప్రజా ప్రతినిధు లు, నాయకులు ఇంటివద్దే ఉండి మద్దతు తెలిపారు. మండలంలోని పోలీస్‌ సిబ్బంది, ఎస్‌ఐలు ప్రతి గ్రామానికి వెళ్లి గ్రామాల్లో ఏర్పాటు చేసుకుంటున్న దేవుళ్ల పండుగలు, ఇతరత్రా శుభకార్యాలను వాయిదా వేయించారు. చెప్పగానే స్వచ్ఛందంగా నిలిపివేసినందుకు పోలీసులు వారికి ధన్యవాదాలు తెలిపారు.  


కరోనా గో అంటూ ప్రజల చప్పట్లు

నల్లగొండరూరల్‌:  కరోనా వైర్‌సను కట్టడి చేసేందు కు కేంద్రప్రభుత్వం పిలుపు మేరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంట లు కాగానే తమ ఇళ్ల ముందుకు వచ్చి చప్పట్లతో కరోనా గో అంటూ చప్పట్లు కొట్టారు. పట్టణంలోనే కాకుండా పల్లెల్లో కూడా ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు రా కుండా కర్ఫ్యూను పాటించారు.

Updated Date - 2020-03-23T10:38:38+05:30 IST