తండ్రి చనిపోయిన దుఃఖంతో పది పరీక్షకు హాజరైన విద్యార్థిని

ABN , First Publish Date - 2020-03-21T07:13:15+05:30 IST

కన్న తండ్రి చనిపోయిన పుట్టెడు ధు:ఖం తో పది పరీక్షకు హాజరైయింది ఓ విద్యార్థిని. మండలంలోని పల్లెర్ల గ్రామంలో...

తండ్రి చనిపోయిన దుఃఖంతో పది పరీక్షకు హాజరైన విద్యార్థిని

ఆత్మకూరు(ఎం), మార్చి 20: కన్న తండ్రి చనిపోయిన పుట్టెడు ధు:ఖం తో పది పరీక్షకు హాజరైయింది ఓ విద్యార్థిని. మండలంలోని పల్లెర్ల గ్రామంలో బైరోజు ధనుం జయ అనే వ్వక్తి గత 3ఏండ్ల క్రితం తన ఇంటిని రిపేరు చేస్తూ ప్రమాదవశాత్తు జారి కింద పడటంతో వెన్నెముకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆరోజు నుంచి ధనుంజయ్య మంచానికి పరమితమై చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం చనిపోయాడు. ధనుంజయకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమారులు లేరు. చిన్న కూతురు బైరోజు వర్షిత ప్రస్తుతం పదో తరగతి వార్షిక పరీక్ష రాస్తోంది. తండ్రి చనిపోయిన పుట్టెడు ధుఃఖంతో  శుక్రవారం జరిగిన తెలుగు రెండో పేపర్‌ పరీక్షకు వర్షిత హాజరై పరీక్ష రాసింది. పరీక్ష ముగిసిన అనంతరం వర్షిత తండ్రి  ధహన సంస్కారాల్లో తల కొరివి పెట్టింది. ఈవిషాదకర సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టారు.

Updated Date - 2020-03-21T07:13:15+05:30 IST