పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి గుండెనొప్పి

ABN , First Publish Date - 2020-03-21T07:26:29+05:30 IST

నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలకేంద్రంలో పది పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినికి గుండె లో నొప్పి రావడండంతో పోలీసులు హుటాహుటిన...

పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి గుండెనొప్పి

నేరేడుగొమ్ము, మార్చి 20: నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలకేంద్రంలో పది పరీక్ష రాస్తున్న ఓ విద్యార్థినికి గుండె లో నొప్పి రావడండంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఎస్‌ఐ రవీందర్‌, పాఠశాల పీఈటీ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం నేరేడుగొమ్ము మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన స్కైలాబ్‌, లలిత కుమార్తె దాని నేరేడుగొమ్ము ఆశ్రమ పాఠశాలలో 10వతరగతి చదువుతోంది. అదే కేంద్రంలో పది పరీక్ష సెంటర్‌కు పరీక్షరాసేందుకు శుక్రవారం వెళ్లింది. పరీక్ష రాస్తుండగానే ఉదయం 10.30గంటలకు గుండెలో నొప్పి వస్తుందని కళ్లుతిరిగి పడిపోయింది. గమనించిన తోటి విద్యార్థులు, ఇన్విజిలేటర్‌లు, పాఠశాల పీఈటీ శ్రీనివా్‌సకు సమాచారం అందించారు. శ్రీనివాస్‌ 108కు సమాచారం అందించగా అందుబాటులోలేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.


నేరేడుగొమ్ము ఎస్‌ఐ రవీందర్‌ పోలీసు వాహనంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని దానిని సిబ్బంది సహకారంతో హుటాహుటిన దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు విద్యార్థినికి మెరుగైన వైద్యసేవలు అందించడంతో విద్యార్థిని కోలుకుంది. రక్తహీనతతోపాటు బలహీనంగా ఉందని వైద్యులు తెలిపారు. అనంతరం స్వగ్రామమైన కేతేపల్లికి  కుటుంబసభ్యులు తీసుకెళ్లినట్లు చందంపేట ఎంఈవో సామ్యనాయక్‌ తెలిపారు. శనివారం పరీక్షకు వి ద్యార్థిని హాజరవుతుందని ఎంఈవో పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. 


పీఏపల్లిలో సొమ్మసిల్లిన విద్యార్థిని

పెద్దఅడిశర్లపల్లి: మండలకేంద్రంలో పదోతరగతి  తెలు గు-2 పరీక్షకు హాజరైన ఓ విద్యార్థిని స్పృహతప్పి కిందపడిపోయింది.  గుడిపల్లి జడ్పీ హైస్కూ ల్‌ విద్యార్థిని దీక్షిత తో టి విద్యార్థులతో కలిసి మండలకేంద్రంలోని ఆదర్శపాఠశాలలో పరీక్షకేంద్రానికి చేరుకుంది. పరీక్షసెంటర్‌కుపోయే క్రమంలో విద్యార్థిని కిందపడిపోయింది.

Updated Date - 2020-03-21T07:26:29+05:30 IST