కరోనా కట్టడికి సహకరించాలి : ఎస్పీ
ABN , First Publish Date - 2020-03-23T10:33:06+05:30 IST
కరోనా కట్టడికి సహకరించాలి : ఎస్పీ

దామరచర్ల, మార్చి 22: కరోనా వైరస్ కట్టడికి ప్రజలు విధిగా సహకరించాలని ఎస్పీ రంగనాథ్ సూచించారు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆదివారం మండలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పరిస్థితిని పరిశీలించి మాట్లాడారు. కరోనా అనుమనితుల వివరాలు సంబంధిత అ ధికారులకు ప్రజలు తెలియజేయాలన్నారు. అనంతరం అధికారుల నుం చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రమే్‌షబాబు, ఎస్‌ఐ నర్సింహారావు ఉన్నారు.