జిల్లా ప్రజలకు కలెక్టర్‌ కృతజ్ఞతలు

ABN , First Publish Date - 2020-03-23T10:25:06+05:30 IST

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ కృతజ్ఞతలు

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ కృతజ్ఞతలు

యాదాద్రి, మార్చి22(ఆంధ్రజ్యోతి): జనతాకర్ఫ్యూను విజయవంతం చేయడంతో పాటు చప్పట్లు కొట్టి వైద్యులు, రెవెన్యూ, పోలీసు, ఇతర పారిశుధ్య సిబ్బందికి చప్పట్ల ద్వారా సంఘీభావం తెలపడం పట్ల కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ కోసం జనతా కర్ఫ్యూ చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూను సోమవారం ఉదయం 6గంటల వరకు చేపట్టిందన్నారు.


ఈ నేపథ్యంలో జనతా కర్ఫ్యూ విజయవంతానికి కృషి చేసిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వ్యాధి విషయంలో ప్రజలు భయాందోళన చెందరాదని, వ్యాధి లక్షణాలు ఉన్నవారు దాచుకోకుండా నిర్భయంగా వైద్య సిబ్బందికి 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి వెంటనే వైద్య సదుపాయం పొందవచ్చునని సూచించారు. తక్షణమే వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం స్పందించి తక్షణ సహాయ చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ భరోసానిచ్చారు. 14రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న వారు స్వీయ నియంత్రణలో ఉండాలని, బయట సంచరించరించరాదన్నారు.  జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, అదనపు కలెక్టర్లు జి రమేశ్‌, ఖిమ్యానాయక్‌ తదితరులు చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-03-23T10:25:06+05:30 IST