చప్పట్లతో కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2020-03-23T10:25:54+05:30 IST
చప్పట్లతో కృతజ్ఞతలు

భువనగిరి టౌన్: కరోనా వైరస్ నియంత్రణకు, వైర్‌సపై ప్రజలను చైతన్య పరిచేందుకు విశేష రీతిన కృషి చేస్తున్న వైద్యులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, జర్నలిస్టులకు జనతా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5గంటలకు చప్పట్ల ద్వారా కృతజ్ఞతలు తెలపాలనే ప్రధాని నరేంద్రమోది సూచనకు భువనగిరి ప్రజలు విశేషరీతిన స్పందించారు. నిర్దేశిత 5గంటలకు పట్టణ వ్యాప్తంగా ఎవ్వరి ఇండ్ల ముందు వారు స్వచ్చందంగా చప్పట్లు కొడుతూ, డప్పులు ఇతర వాయిద్యాలు వాయిస్తూ 5నిమిషాల పాటు తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రజలు సామాజిక స్ఫూర్తిని ప్రదర్శిస్తూ చప్పట్లు కొడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ర్యాలీగా
జనతా కర్ఫ్యూలో భాగంగా ప్రముఖులతో పాటు ప్రజలంతా చప్పట్ల ద్వారా తమ సంఘీభావాన్ని తెలిపారు. సాయంత్రం 5గంటలకు కలెక్టర్ అనితారామచంద్రన్ సిబ్బందితో కలిసి ఆమె గృహంలో చప్పట్లు కొట్టారు. మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు స్థానికులతో కలిసి రాయిగిరిలో చప్పట్లు కొట్టారు. పోలీసు వాహనాలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనం సైరన్ మోగిస్తూ ర్యాలీ నిర్వహించడంతో ప్రజలందరు రహదారులపైకి వచ్చి చప్పట్లతో మద్దతు తెలిపారు. ఆర్డీవో ఎంవీ భూపాల్‌రెడ్డి, ఏసీపీ భుజంగరావు, ట్రాఫిక్ ఏసీపీ ఎం శంకర్, అగ్నిమాపక శాఖ అధికారి కెడాక్టర్ బాబు, తహసీల్దార్ జనార్థన్ రెడ్డి, రూరల్ సీఐ సురేందర్ రెడ్డి, ఎస్‌ఐ అంజయ్య, మునిసిపల్ కౌన్సిలర్ ఉదయగిరి విజయ్‌కుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.